పర్యావరణ మనుగడకు ప్లాస్టిక్ నియంత్రణే మార్గం..


Ens Balu
2
Visakhapatnam
2020-10-23 23:17:46

పర్యావరణం, మానవ జీవనానికి హానికలిగిస్తున్న సింగల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు బదులు ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించాలని  జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం, వై.ఎం.సి.ఏ.నకు ఎదురుగా బీచ్ రోడ్డులో జివిఎంసి ఇండియన్ యూత్ ఫర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వస్తువులను ఇవ్వండి. ప్రత్యామ్నయ వస్తువులను తీసుకొని వెళ్ళండి అనే నినాదం గల ప్లాస్టిక్ పార్లరును కోవిడ్-19 వలన గత కొంతకాలంగా మూసివేయబడిన దాన్ని పున:ప్రారంబోత్సవమును కమిషనరు చేసారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ తో పర్యావరణం కలుషితమౌతుందని జల, చర జీవరాసుల ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు. ఎవరైనా, ఒక కేజీ ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసుకొచ్చి ఒక కప్పు కాఫి  సేవించి వెళ్ళడం అనే వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టిన ఇండియన్ యూత్ ఫర్ సొసైటీను  కమిషనర్ అభినందించారు. ప్లాస్టిక్ నిరోధమునకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు  కృషి చేయాలన్నారు. ఇటువంటి ప్లాస్టిక్ పార్లర్లు జివిఎంసి పరిధిలో నాలుగు చోట్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇండియన్ యూత్ ఫర్ సొసైటీ  ప్రెసిడెంట్ వై. అప్పల రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పూర్తిగా సింగ్లీ యూజ్ ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నయ వస్తువులైన గుడ్డ, నార సంచులను వాడాలన్న  అవగాహన కోసమై ఈ ప్లాస్టిక్ పార్లర్ ను ప్రారంబించామన్నారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జివిఎంసి వారి సౌజన్యముతో “గివ్ ప్లాస్టిక్స్  – గెట్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్” అనే నినాదంతో ప్రజలలో ప్లాస్టిక్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలే కాకుండా ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు, పాదరక్షలు, వస్త్రాలను కూడా ఈ పార్లరులో స్వీకరిస్తున్నామన్నారు. అనంతరం, 10వ వార్డు కె.ఆర్.ఎం. కోలనీలో డ్రై రిసోర్స్ సెంటరును సందర్శించారు. అక్కడ యంత్ర సామగ్రీని పరిశీలించి వాటి సామర్ధ్యాన్ని పెంచేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులతో ఆదేశించారు. సందర్శనకు గుర్తుగా మొక్కలను నాటారు.  ఈ పర్యటనలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్ జయరాం తదితర అధికారులు పాల్గొన్నారు.