పంట నష్టాలను నిష్పక్షపాతంగా నమోదుచేయండి..
Ens Balu
2
Atmakur
2020-10-24 12:46:44
కర్నూలు జిల్లాలో పంట నష్టాలను నిష్ఫక్షపాతం అంచనా వేయాలని జెసి(అభివ్రుద్ధి) రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని ఆత్మకూరు మండలం కరివేన సచివాలయ పరిధిలోని అధిక వర్షాల కారణంగా పాడైపోయిన పంటను జెసి పరిశీలించారు. ఈసందర్బంగా అక్కడ బాధిత రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అత్యధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన ప్రతీరైతుకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని చెప్పారు. అదేసమయంలో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాలను రికార్డు చేయాలన్నారు. ఏరకం పంట ఎంత విస్తీర్ణంలో వేశారు, రైతులు, కౌలు రైతులు, పంటల భీమా, తదితర అంశాలను పరిగణలోనికి తీసుకొని విచారణ చేపట్టడంతోపాటు, రైతుల వివరాలను ఆధారాలతో నమోదు చేయాలన్నారు. ఎక్కడైనా సిబ్బంది బాధిత రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడినా దైర్యంగా స్థానిక గ్రామసచివాలయం ద్వారి ఫిర్యాదు చేయాలని కూడా జెసి రైతులకు సూచించినట్టు వివరించారు....