విశాఖలో తడిచెత్తతో ఎరువులు తయారీ..
Ens Balu
3
Visakhapatnam
2020-10-24 16:33:32
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఘన వ్యర్దాల నిర్వహణ నియమాలు 2016ను అనుసరించి ప్రజలు తమ ఇంటి వద్దే చెత్తను తడి చెత్తతో సంపద తయారు చేసుకునేవిధంగా జీవిఎంసీ ప్రణాళికలు రూపొందిస్తుంది. నగర ప్రజలు తమ ఇంటి వద్దే ఎరువులు తయారు చేసే విధముగా ప్రజలకు సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, ఆర్.పి ల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహిస్తున్నారు. 2020 సంవత్సరానికిగాను నగరంలో 14,600 ఇళ్ళలో హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని అమలు చేస్తుండగా 2021 లో దానిని 48,000 ఇళ్ళలో హోమ్ కంపోస్టింగ్ చేయించాలని లక్ష్యంగా మహా విశాఖ పట్నం నగర పాలక సంస్థ పనిచేస్తుంది. అలాగే నగరంలోగల 101 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, 186 బల్క్ వేస్ట్ జనరేటర్లుతో కూడా వారి ప్రాంగణంలోనే 100% తడి చెత్తను ఎరువులుగా తయారీ చేయించే విధంగా ప్రణాళికలు సిద్ధంచేసి అమలు చేస్తున్నారు. ఇలాగే రాబోయే స్వచ్ఛ్ సర్వేక్షన్ - 2021 లో ప్రజలను భాగస్వాములను చేసుకొన్న సిటిజెన్ కేటగిరీ బలోపేతం చేసుకొని మెరుగైన స్థానాన్నికై కృషి చేస్తామని మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ డా. జి. సృజన తెలియచేసారు. స్వచ్ఛ భారత్ నినాద స్పూర్తితో స్వచ్ఛ విశాఖపట్నం నిర్మించే దిశగా అడుగులు వేస్తున్న మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 2020 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 10 లక్షల కన్న ఎక్కువ జనాభా గల నగరాల కేటగిరీలో 9వ స్థానం సాధించిన విషయం విదితమే. ఇప్పటికే మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 2021 సంవత్సరలో స్వచ్ఛ్ సర్వేక్షన్ లో మరింత మెరుగైన స్థానాన్ని సాధించాలని లక్ష్యంగా ఇప్పటికే పలు కార్యక్రమలు ప్రారంభించింది.