వ్యాపాస్థులు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..


Ens Balu
2
జీవిఎంసీ
2020-10-24 19:12:18

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్నీ కోవిడ్ నియమావళిని అనుసరిస్తూ వారి వ్యాపారాలు సాగించాలని అదనపు జివిఎంసి కమిషనర్  డా. వి. సన్యాసి రావు స్పష్టం చేశారు. శనివారం, జివిఎంసి లో హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ యజమానులు ప్రతినిధులతో సమీక్ష నర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 పై ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అవగాహన సదస్సు నిర్వహిస్తుందని, ప్రభుత్వానికి పూర్తీగా సహకారం అందించాలన్నారు. కోవిడ్ నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించి వ్యాపారాలు చేయాలన్నారు. మాస్కులు, శానిటైజర్స్ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ హోటల్ ముందు వచ్చే వినియోగదారులు పర్యాటకులకు కనిపించేలా కోవిడ్ నియమావళి తెలిపే బ్యానర్ పెట్టాలని, ప్రధాన గేటు వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయాలన్నారు. హోటల్, రెస్టారెంట్స్ లలో సిట్టింగ్స్ తగ్గించి బౌతిక దూరం ఉండేలా చూడాలన్నారు. డిస్ప్లే బోర్డులు, “నో మాస్క్ – నో ఎంట్రీ” బోర్డులు, ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి ప్రజలకు మీవంతు అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ మరల రెండో దశ మొదలైందని, తగు జాగ్రత్తలు పాటించి వ్యాపారాలు చేసుకోవాలన్నారు. హోటల్, రెస్టారెంట్స్  లకు వచ్చే వినియోగదారుల యొక్క లగ్గేజ్ ను  శానిటైజర్ చేసి వారికి కేటాయించే గదులను, బాత్ రూములను  హైపో క్లోరేట్ తో శుభ్రపరచాలన్నారు. ప్రతీ రోజూ వినియోగదారునితో పాటు  మీ సిబ్బందిని కూడా థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, అనుమానం ఉంటే, లోనికి అనుమతి ఇవ్వకూడదన్నారు. వీలైనంతవరకు స్కేనర్ వాటర్ ట్యాప్ లు ఏర్పాటు చేయాలని, మా సిబ్బంది తనిఖీ నిమిత్తం వచ్చినప్పుడు, మీరు వారికి సహకరించాలన్నారు. అనంతరం జివిఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గాదర్సాకాలను పాటిస్తూ మీ వ్యాపారాలు చేయాలని, ప్రతీ హోటల్, రెస్టారెంట్స్ లలో అవగాహన కోసం బోర్డులు ఏర్పాటు చేయాలని, మాస్కులు లేకుండా ఎవరికీ ఇవ్వకూడదని, వంటగదులు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ యజమానులు, జివిఎంసి ఏ.ఎం.ఓ.హెచ్.  డా. జయరాం తదితరులు పాల్గొన్నారు.