గీతంపై తక్షణమే CBI విచారణ జరపాలి
Ens Balu
3
Githam College
2020-10-24 19:53:23
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో గీతం టుబీ డీమ్డ్ యూనివర్సిటీ ప్రహరీ గోడలను కూల్చి వేసినంత మాత్రాన గీతం సంస్థ చేసిన అక్రమాలు సరి చేసినట్లు కాదని AP ప్రజా సంఘాల జెఎసి అధ్యకులు జెటి రామారావు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.. సుమారుగా నాలుగు దశాబ్దాల నుండి విశాఖపట్నంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న గీతం యూనివర్సిటీ పై పూర్తిస్థాయిలో సి.బి.ఐ ,ఈ డి వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంస్థకు విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల అదాయం ఫీజులు , విరాళాల రూపంలో అర్దిక నేరాలకు పాల్పడ్డారని, మనీలాండరింగ్ ఇన్కమ్ టాక్స్ చట్టాల ద్వారా తనిఖీలు నిర్వహించాలని లేకుంటే రికార్డులు తారుమారు అవుతాయని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గీతం టుబీ డీమ్డ్ యూనివర్సిటీ ని స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే వర్సిటీ లోపల ఉన్న అధునాతన భవనాలు క్రికెట్ గ్రౌండ్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో నిర్మించారని వాటిని వెంటనే కూల్చి వేయాలన్నారు. సంస్థలో అనేక ఆత్మహత్యలు, సంఘటనలు జరిగినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. ఒక్కోసారి ఈ సంస్థనుంచి ఇచ్చిన నకిలీ డిగ్రీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. హుదూద్ సమయంలో పెద్దలకు దక్కాల్సిన నష్ట పరిహారం సుమారు 50 కోట్ల రూపాయల పైన రాజకీయ పలుకుబడితో దక్కించుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీని పథకం ప్రకారం నిర్వీర్యం చేసి అంతర్జాతీయ స్థాయిలో తన సామ్రాజ్యాన్నివిస్తరించిందన్నారు. ఎటువంటి వుడాGVMC అనుమతులు లేకుండానే అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణాలు చేసిందన్నారు. గతంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా సర్వర్ ప్రాబ్లం తో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అలాగే ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ గూగుల్ వంటి వాటిని కూడా ముంచారని అన్నారు. సంవత్సరానికి 20 లక్షల రూపాయల ఫీజులతో సుమారుగా 15 వేల మంది విద్యార్థులను నలభై సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతున్న ఇంతవరకూ ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదని,తాము అనేక వినతులు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, కాని CM Y S జగన్ ఎటువంటి రాజకీయ వత్తిడిలకు లొంగకుండా అయన తీసుకున్న కూల్చివేత చర్యలు కు అభినందనలు తెలుపుతున్నామన్నారు.