కబ్జాదారులూ భూములు తిరిగి ఇచ్చేయాలి...


Ens Balu
3
ప్రభుత్వ అతిథి గ్రుహం
2020-10-24 19:57:44

కోవిడ్ – 19  తగ్గిందని భావించి,  నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని,   వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పర్యాటక  శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు  ప్రజలకు విజ్ఞప్తి చేసారు. శనివారం నాడు   స్థానిక సర్క్యూట్   హౌస్ లో    విలేఖరుల  సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ   ఎటువంటి  అవినీతికి తావు లేని పరిపాలన  అందిస్తున్నామని తెలిపారు.  సామాన్యుడు కూడా  ఎటువంటి భయందోళనలు లేకుండా నిశ్చింతగా   ఉండే విధంగా పరిపాలన జరుగుతుందని తెలిపారు. పేద  ప్రజలకు ఎటువంటి  వివక్ష లేకుండా  సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని  అన్నారు. 40 రోజుల క్రితం  రుషికొండలోని గీతం విద్యా సంస్థల యాజమాన్యం సమక్షంలోనే  ఆర్ డి ఓ , ఎమ్మార్వోలు  సర్వే చేయించి,  ప్రభుత్వ భూమి  సరిహద్దులను    నిర్థారించడం జరిగిందని  తెలిపారు. ఎవరు తప్పు చేసినా  ఉపేక్షించేది లేదని,  ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వాళ్లు స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు.ప్రభుత్వ భూములను ఆక్రమించడం తప్పు అని,  ఎవరైనా తెలిసో, తెలియకో ప్రభుత్వ భూమి తమ ఆధీనంలో ఉంటే, ఆ భూమిని ప్రభుత్వానికి  తిరిగి ఇచ్చేయాలని,  ఒక వేళ  ఆ భూమి వారికి అవసరమని భావిస్తే, ప్రభుత్వానికి తగు విధంగా  దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  శాసన సభ్యులు  అదీప్ రాజు, తిప్పల నాగిరెడ్డి  పాల్గొన్నారు.