సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా ప్రకటించాలి..


Ens Balu
3
Rambilli
2020-10-24 20:13:56

గ్రామసచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ఎప్పటికప్పుడు నవీకరించి, సవరిస్తూ ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. విశాఖజిల్లా రాంబిల్లి  మండలంలో శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టర్ మట్లాడుతూ, రెండు రోజులలో  ఈ జాబితాలను, రికార్డులను సమర్పించాలని ఈవో ఆర్ డి ని ఆదేశించారు.  గ్రామ సచివాలయాలలో అనేక రకాల సేవలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సచివాలయంలో  చాలా తక్కువగా సేవలు అందిస్తున్నారని, ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి మరిన్ని సేవలను అందుబాటు లోకి తేవాలని ఆదేశించారు. అక్కడి సిబ్బందితో వివిధ విషయాలపై చర్చించారు. దృవ పత్రాల జారీ, సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా నిర్వహిస్తున్నది  పరిశీలించారు.  రైతు భరోసా కేంద్రాన్ని కూడా సందర్శించి అక్కడి సేవలను పరిశీలించారు.  ఈ పర్యటనలో అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి, ఏ డి ఆర్, ఏఈ, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, తాసిల్దార్ ఇతర శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.