నిష్ఫక్షపాతంగా పంటనష్టాల నమోదుచేయాలి..
Ens Balu
2
Allagadda
2020-10-25 14:11:57
కర్నూలు జిల్లా వ్యాప్తంగా వరిపంటలు దెబ్బతిన్నాయో సమాచారం అందించాలని జెసి(సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని ఆళ్ళగడ్డ మండలం చింతకొమ్మ దిన్నే, పడకండ్ల గ్రామాల్లో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న వరి పంట పొలాలను, ఇళ్లను పరిశీలించి, రైతులతో పంట నష్టం గురించి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పెట్టుబడులు, చేసిన కూలీ మొత్తం నష్టం భారీగా వచ్చిందని రైతులు జెసికి వివరించారు. అనంతరం జెసి మాట్లాడుతూ, రైతులకు జరిగిన పంటనష్టాలను, దెబ్బతిన్న ఇళ్లను అధికారులు గుర్తించి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చిరు. ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతామని, ఖచ్చితంగా నష్టపరిహారం అందుతుందని రైతులకు జెసి వివరించారు. జిల్లాలో మండలాలు, ప్రాంతాల వారీగా నష్టాలను అంచనాలు వేసి పంపాలన్నారు. పంట నష్టపోయిన ఏఒక్క రైతును వదిలిపెట్టకుండా నివేదికలు తయారు చేసి పంపాలన్నారు.