పెండింగ్ ఇ-చలనాలు తక్షణమే చెల్లించండి..
Ens Balu
5
Tirupati
2020-10-26 16:24:32
ఇ-చలానా వాహనాలపై నమోదైన తేది నుంచి 15 రోజులు దాటినా జరిమానా చెల్లించని వాహనదారులను స్పెషల్ డ్రైవ్ ద్వారాగుర్తించి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి ట్రాఫిక్ డిఎస్పీ మల్లిఖార్జునావు స్పష్టం చేశారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి ఆర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్ టీం ను అర్బన్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇప్పటివరకూ యం.వి యాక్ట్ నిబంధనలు అతిక్రమించి ఇ-చలాన ద్వారా కట్టవలసిన మొత్తము ప్రస్తుతము 1,93,361 ఇ-చలాన సంబంధించి రూ. 9,98,85,971/- గా ఉన్నదన్నారు. ఇ-చలాన వేయబడిన వాహనదారుడు ఆ డబ్బును తప్పనిసరిగా 15 రోజులలో ఆన్లైన్ ద్వారా చెల్లించాలని హెచ్చరించారు. అలాగే సెకండ్ హాండ్ వాహన కొనుగోలుదారు ఎవరైనా, కొనబోయే వాహనాల ఇ-చలాన పెండింగ్ ఉందా లేదా అని ముందుగానే తనికీ చేసుకోవాలని కూడా డిఎస్పీ సూచించారు. AP eChallan అప్లికేషన్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వెహికల్ నెంబర్ ను నమోదు చేసి ఇ-చలాన పెండింగ్ ఉందా లేదా అని ముందుగానే తనికీ చేసుకోవాలన్నారు.