ఉత్సాహంగా పోలీసుల ’రన్ ఫర్ యూనిటీ‘..
Ens Balu
2
Tirupati
2020-10-26 16:27:42
విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల సేవలు, వారి వీరోచిత పోరాట ప్రతిమకు గుర్తింపుగా వారందరికీ ఘనమైన నివాళులు అర్పించడం కోసం రన్ ఫర్ యూనిటీ పేరిట కార్యక్రమం నిర్వహించినట్టు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి తెలియజేశారు. సోమవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని యస్.వి యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా అమరులైన వీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి 31 వరకు ప్రతి రోజు ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతే కాకుండా సంవత్సరంలో ఒక వారం రోజులపాటు ఇలా గుర్తించుకుంటు వస్తున్నామన్నారు. కానీ ఇకపై తిరుపతి అర్బన్ జిల్లాలో అమరులైన కుటుంబ సభ్యులను ప్రతి నెల అవకాశం దొరికనపుడల్లా జిల్లా అధికారులతో పాటు వారి నివాస ప్రాంత పోలీస్ అధికారులు వెళ్లి పరార్శించి, ఆరోగ్య పరమైన విషయాలను తెలుసుకొని అవసరమైన సహాయం చేయాలని నిర్ణయించామన్నారు. డి.జి.పి సూచనలు, సలహాల మేరకు జిల్లాలోని సిబ్బందికి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ సిబ్బంది యొక్క ఆరోగ్య విషయాలను కూడా గమనిస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకొని అవసరంమేర వారికి సహకారం అందిస్తున్నామని ఎలాంటి అవసరమైనా చేయడానికి సిద్దంగా ఉన్నానని జిల్లా యస్.పి గారు తెలియజేసారు. అనంతరం “రన్ ఫర్ యూనిటీ” లో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన సిబ్బందికి యస్.పి రివార్డ్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ యస్.పి సుప్రజ, యస్.బి డి.యస్.పి గంగయ్య, అర్బన్ జిల్లాలోని డి.యస్.పి లు, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.