27 నుంచి ఆసెట్, ఆఈట్ కౌన్సెలింగ్ ..
Ens Balu
4
ఆంధ్రాయూనివర్శిటీ
2020-10-26 16:55:24
ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసెట్, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ఆఈట్ ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్ కౌన్సెలింగ్ పక్రియ ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు తెలిపారు. ఈ నెల 27 నుంచి ఆన్‌లైన్ సర్టిఫీకేట్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 28వ తేదీన సిఏపి విభాగాలకు నేరుగా ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో సర్టిఫీకేట్ల పరిశీలన జరుపుతామన్నారు. 29వ తేదీన దివ్యాంగుల విభాగాలకు ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో సర్టిఫీకేట్ల పరిశీలన జరుగుతందన్నారు. ఈ నెల 28, 29 తేదీలలో ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, క్రీడా విభాగాల విద్యార్థులు తమ సర్టిఫీకేట్లను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఈనెల 30 నుంచి నవంబరు 7వ తేదీ వరకు ఆసెట్, ఆఈట్ విభాగాలలో అభ్యర్ధులందరూ తమ సర్టిఫీకేట్లను అప్‌లోడ్ చేయాలన్నారు. నవంబరు 5 నుంచి 9వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లలో మార్పు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. నవంబరు 12వ తేదీన సీట్లు కేటాయింపు జరుగుతుందన్నారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు నవంబరు 13 నుంచి 15వ తేదీలోగా నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నవంబరు 16, 17 తేదీలలో సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ప్రవేశ పత్రాలను అందించాలన్నారు. ఆన్‌లైన్ తరగతులు సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవలసిన సర్టిఫీకేట్లు, కోర్సుల వారీగా కౌన్సెలింగ్ తేదీలు వంటి పూర్తి సమాచారం ప్రవేశాల సంచాలకుల http://audoa.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పూర్తి సమాచారం కోసం ను సంప్రదించాలని సూచించారు.