27 నుంచి కళాశాలలు ప్రారంభం..
Ens Balu
2
Srikakulam
2020-10-26 17:41:02
శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఈ నెల 27 నుండి పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీరాములు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. 2020-21 విద్యా సం.రంలో డిగ్రీలో చేరుటకు అర్హులైన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ నెల 28లోగా తమ కార్యాలయానికి అందజేయాలని అన్నారు. బి.యస్సీ విద్యార్ధులు ఈ నెల 29న, బి.ఏ మరియు బి.కామ్ విద్యార్ధులు ఈ నెల31న ఉదయం 10.00గం.లకు తమ ఒరిజనల్ సర్టిఫికేట్లు, అడ్మిషన్ ఫీజుతో హాజరుకావాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్ధులకు నవంబర్ 2 నుండి, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు 3 నుండి, ఫైనల్ ఇయర్ విద్యార్ధులకు 4 నుండి తరగతులు నిర్వహించబడతాయని ఆయన స్పష్టం చేసారు. కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా మాస్కును ధరించాలని, మాస్కులు లేని విద్యార్ధులను అనుమతించబోమని తెలిపారు. ఈ ఏడాదిలో కొత్తగా యం.ఎస్సీ పి.జి., బి.యస్సీ (ఎం.పి.డబ్ల్యు ), బి.యస్సీ(బి.సి.ఎ).,బి.ఏ(హెచ్.పి.ఇ) కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని, అర్హులైన అభ్యర్ధులు వచ్చేనెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 9 నుండి తరగతులు నిర్వహించబడతాయని ఆ ప్రకటనలో వివరించారు. యు.జి.సి వారి స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ : డిజాస్టర్ మేనేజ్ మెంట్ , ఐ.టి/ఐటిఇయస్/వెబ్ డిజైనింగ్ టూల్స్ సర్టిఫికేట్ కోర్సులు మరియు హెల్త్ కేర్, బ్లడ్ బ్యాంక్ టెక్నిషీయన్ వంటి డిప్లోమా కోర్సులకు ఈ విద్యా సంవత్సరం నుండి నిర్వహించబడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ యు.జి.కోర్సులలో చేరుటకు కళాశాల రెగ్యులర్ విద్యార్ధులు మరియు పూర్వ విద్యార్ధులు కూడా అర్హలేనని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. వివిధ యూనివర్సిటీలో నిర్వహించిన పి.జి.సెట్ నందు 1,3,6,9,10 ర్యాంకులతో పాటు 50 లోపు ర్యాంకులు సాధించిన 22 మంది ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధినులను ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.