ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు కండి..
Ens Balu
3
ప్రధమ ప్లాస్టిక్ హౌస్
2020-10-26 20:41:30
విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏఒక్క చిన్న అవకావం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకొని విశాఖను స్వచ్ఛ సర్వేక్షణ్ లో నెంబవర్ స్థానంలో నిలబెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పండగలు, శెలవు దినాలు అని చూడకుండా ప్లాస్టిక్ రహితంగా ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ఆమె ముందుంటున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రధమ ఆసుపత్రి వినూత్నంగా నిర్వహించ తలపెట్టి ప్లాస్టిక్ హౌస్ ను ఆమె ప్రారంభించారు. ఈ సంర్బంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగ నియంత్రణలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఎవరి ఇంట్లోనూ ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉంచకూడదు దానికోసం..దానికోసం ప్రత్యేకంగా ప్లాస్టిక్ పార్లను ఏర్పాటు చేశారు. దాని యొక్క విశిష్టతను ఆసుపత్రి అధినేత స్వచ్ఛ భారత్ అంబాసిడర్ డా. విశ్వేశ్వర రావు వివరించారు. ఒక కిలో ప్లాస్టిక్ ఇస్తే టిఫిన్, రెండు కిలోల ప్లాస్టిక్ ను ఇస్తే ఫుల్ మీల్స్, మూడు కేజీల పైబడి ప్లాస్టిక్ ను ఇస్తే కొన్ని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తామని, ఈ ప్రక్రియ ద్వారా ప్రజలను ఆకర్షించి ప్లాస్టక్ ను నిర్మూలించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని ప్రధమ హాస్పిటల్ యజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ అంబాసిడర్ ప్రధమ హాస్పిటల్ యజమాన్యం డా. విశ్వేశ్వర రావుతో పాటూ జివిఎం సి అదనపు కమిషనరు డా. వి. సన్యాసి రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.