తమాషాలు చేస్తే ఇంటికి పంపిస్తా..
Ens Balu
3
RK Beach
2020-10-26 20:46:11
ప్రజలకు వార్డు సచివాలయాల ద్వారా పూర్తిస్థాయిలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన సిబ్బందిని హెచ్చరించారు. సోమవారం మూడవ జోన్ పరిధిలోని ఆర్. కే. బీచ్ 19 వార్డులో గల నాలుగు సచివాలయాలను కమిషనర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల కార్యదర్శులు వారి జాబ్ చార్ట్ పరంగా విధులను గురించి సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను తెలుపు పోస్టులను లబ్ధిదారుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని పథకాల లబ్ధిదారులు జాబితాలలో లేకపోవడం గమనించి వారికి ప్రత్యేక అధికారిని, సంబంధిత కార్యదర్శిని హెచ్చరించారు. వెంటనే లబ్ది దారుల జాబితాను నోటీసుబోర్డుల్లో పెట్టాలని ఆదేశించారు. సచివాలయ భవనం వద్ద చెత్త ఉండడం గమనించి వెంటనే తొలగించాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. సంబందిత శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు అడ్మిన్, శానిటరీ కార్యదర్శులకు మెమోను జారీ చేసారు. ఇకముందు ఇటువంటివి పునరావృతం అయితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జోనల్ కమిషనర్ బి. సన్యాసి నాయుడు, వార్డు ప్రత్యేక అధికారి, ఏ.పి.డి నాగమణి, వివిధ విభాగాల వార్డు కార్యదర్శులు, యు.సి.డి. సిబ్బంది పాల్గొన్నారు.