రైతు సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం..


Ens Balu
3
ఏలూరు
2020-10-27 15:20:33

భారతదేశంలో రైతు పక్షపాతి ప్రభుత్వమంటే అది వైఎస్ జగనన్న ప్రభుత్వం  మాత్రమేనని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రైతులు శుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం ఆనందంగా వుందని నమ్మే సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన ఎందరో రైతులకు మేలు జరుగుతుదన్నారు. మంగళవారం పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో రైతు భరోసా రెండో విడత చెక్కుల పంపిణీ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లాలోని 3,41,003 రైతు కుటుంబాలకు వైస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ద్వారా 82 కోట్ల 4 లక్షల రూపాయలు పెట్టుబడి సహాయం ద్వారా అందించామన్నారు. అంతేకాకుండా  జులై ఆగస్ట్ ,సెప్టెంబర్ నెలలో కురిసిన అధిక వర్షాలకు, గోదావరి వరదల వలన ఇబ్బంది పడిన 21,242 రైతు కుటుంబాలకు రూ 15 కోట్ల59 లక్షల ను పెట్టుబడి సహాయంగా కూడా అందించినట్టు వివరించారు. ప్రతి సంవత్సరం రైతు కుటుంబానికి రూ 13500 పెట్టుబడి సహాయం అందిస్తున్నామని 5 సంవత్సరాల లో మొత్తం పెట్టుబడి సహాయం రూ 67,500గా ఇవ్వనున్నామని చెప్పారు.  శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు గారు,కోటారు అబ్బాయ్ చౌదరి, ఎమ్మెల్సీ రామ సూర్యారావు, జిల్లా డి.సి.సి.బి చైర్మన్ శ్రీనివాస్  ,జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు,జె.సి వెంకట రమణా రెడ్డి ,జేడీ అగ్రికల్చర్ గౌస్య భేగం తదితరులు పాల్గొన్నారు.