గర్భిణీలకు మెరుగైన సేవలు అందించాలి..


Ens Balu
5
Salur
2020-10-27 16:10:19

గర్భిణీ వసతి గృహాలలో గర్భిణిలకు  మెరుగైన సేవలు   అందించాలని పార్వతీపురం ఐటిడిఏ పీఓ ఆర్. కూర్మనాథ్  పేర్కొన్నారు. మంగళవారం ప్రాజెక్ట్ అధికారి తన పర్యటనలో భాగంగా సాలూరు వై.టి.సి.లో ఉన్న గర్భిణీ వసతి గృహం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా గర్భిలకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు, రోజువారీ మెనూ ప్రకారం వారికి ఆహారం అందజేస్తున్న వివరాలు పరిశీలించారు. వసతి గృహంలో వున్న మహిళలతో మాట్లాడుతూ మీకు వైద్య పరీక్షలు చేస్తున్నారా, మీకు సమయానికి ఆహారం అందిస్తున్నారు అలాగే మీకు అందిస్తున్న ఆహారం ఎలావుంటుంది అన్న వివరాలు ఆడీగి తెలుసుకున్నారు అలాగే మీకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయా. ఏమైనా సమస్యలు వుంటే తెలపండి సత్వరం పరిష్కరించ డం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ గర్భిణీలకు మెనూ ప్రకారం పోషక విలువల తో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ఏటువంటి పిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే   గర్భిణీ వసతి గృహం లో ఉన్న వైద్యులు గర్భిణీలకు ఎప్పటి కప్పుడు కావలసిన వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించేయలని సంబంధిత మెడికల్ ఆఫీసర్స్ కి సూచించారు.