ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందాలి..
Ens Balu
3
Makkuva
2020-10-27 16:37:18
రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సేవలు అందించే నిమిత్తం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిందని వినూత్నమైన మార్పులు తీసుకువచ్చిందని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి మంగళవారం తన పర్యటనలో భాగంగా మక్కువ మండలం కవిరిపల్లి, మర్కండపుట్టి గ్రామాలలో గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులు, మక్కువ గ్రామంలో గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పనుల నిర్వహణలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చేపట్టాలన్నారు పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. అనంతరం మర్కొండపుట్టి గ్రామ సచివాలయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా ఆనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని సమయపాలన పాటించాలని అన్నారు. పిర్యాదుల సేకరణలో పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హజరుపట్టి, ప్రగతి నివేదికల పట్టిక పరిశీలించారు. వాలంటరీ వ్యవస్థను సక్రమంగా వినియోగించుకోవాలని హితవు పలికారు. ఈ పర్యటనలో RWS AE, రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ ఆధికారులు సిబ్బంది పాల్గొన్నారు.