గంగమ్మతల్లీ నువ్వే విశాఖకు రక్ష..


Ens Balu
3
గంగమ్మతల్లి ఆలయం
2020-10-27 17:05:21

విశాఖ మహానగరానికి ఎలాంటి ప్రక్రుతి వైపరీత్యాలు రాకుండా ప్రజలను చల్లగా చూడాలని శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి దీవించాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఎంపీ ఎంవివి సత్యన్నారాయణలు చెప్పారు. విశాఖ బీచ్ రోడ్డులోని నేవీ క్యాంటీన్ ఎదురుగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి ఆలయాన్ని మంగళవారం మత్సకారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, విశాఖలో కరోనా లాంటి విపత్తు మరోసారి రాకుండా గంగమ్మ కాపాతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కరుణతో మత్స్యకారులు శుభిక్షంగా ఉండాలని, వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా తోడుండే అవకాశం ఇవ్వాలన్నారు. చేపలవేటపైనే జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారన్నారు. ఇటీవల బిసిలకు ఏర్పాటు చేసిన కార్పోరేషన్ లలో కూడా మత్స్యకారులకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందనే విషయాన్ని వీరు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, దక్షిణ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు...