నిండ్రలో బిసిహాస్టల్ ఏర్పాటు చేయండి..


Ens Balu
3
నిండ్ర మండలం
2020-10-27 18:28:08

చిత్తూరుజిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలో గవర్నమెంట్  బిసి బాయ్స్  హాస్టల్ ను మంజూరు చేయవలసిందిగా  బిసి వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన వెలుగోపాలా కృష్ణ ను కలిసి నగిరి ఎమ్మెల్యే ఆర్కేరోజా వినతి పత్రం సమర్పించారు. మంగళవారం ఈమేరకు మంత్రి కార్యాలయంలో ఆయనను రోజా మర్యాదపూర్వకంగా కలిసి బిసి హాస్టల్ విషయమై ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో బిసి బాయ్స్ హాస్టల్ లేకపోవడం వలన ఎందరో నిరుపేద బిసిలు పట్టణ ప్రాంతాల్లో పెయిడ్ హాస్టల్స్ ఉండాల్సి వస్తుందన్నారు. బిసి బాయ్స్ యొక్క పరిస్థితిని అర్ధం చేసుకొని హాస్టల్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే ఆర్కేరోజా వినతిసై మంత్రి సానుకూలంగా స్పందించారని రోజా మీడియాకి వివరించారు. నగిరి నియోజకవర్గంలోని అభివ్రుద్ధి కార్యక్రమాలతో విద్యకు కూడా పెద్దపీ వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే హాస్టల్ విషయం మంత్రి ద్రుష్టికి తీసుకువెళ్లినట్టు రోజా వివరించారు. మంత్రిని కలిసిన వారిలో సినీ దర్శకులు, రోజా భర్త సెల్వమణి కూడా ఉన్నారు...