రేపు హోం మంత్రి రాక..


Ens Balu
3
Srikakulam
2020-10-27 22:17:28

రాష్ట్ర హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ఈ నెల 29వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద గల రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ నూతనంగా నిర్మించిన భవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, శాసన సభాపతి తమ్మినేని సీతారాం, పశుసంవర్ధక శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజులతో కలసి హోమ్ మంత్రి ప్రారంభిస్తారని జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతోపాటు అగ్నిమాపక శాఖ మహా సంచాలకులు (డైరక్టర్ జనరల్) మహమ్మద్ హసన్ రెజా, అదనపు మహా సంచాలకులు పి.వి.సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్ జె నివాస్ ఇతర అతిథులు పాల్గొంటారని ఆయన వివరించారు.