జగనన్న పచ్చతోరణం విజయవంతం చేయాలి..కలెక్టర్
Ens Balu
2
2020-07-22 23:46:03
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్న పచ్చ తోరణం” కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని హౌసింగ్ లేఔట్ లలో మొక్కలునాటే కార్యక్రమం ఈనెల 30 వ తారీకు లోపల పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ డ్వామా సిబ్బందిని ఆదేశించారు. బుధవారం పెందుర్తి మండలం, గుర్రంపాలెం పంచా యతీ, అక్కిరెడ్డిపాలెం లో పేదల హౌసింగ్ లేఅవుట్ వద్ద 71వ వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అటవీ శాఖ మొక్కలు నాటిన తర్వాత వాటిని పెంచే బాధ్యత పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని కోరారు. స్థానిక శాసన సభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ మాట్లాడు తూ ప్రకృతి ని కాపాడవలసిన బాధ్యత అందరిది అన్నారు. ముఖ్యమంత్రి తలపెట్టిన "జగనన్న పచ్చతోరణం" పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆహుతులు అందరిచే ప్రతి ఒక్కరం 10 మొక్కలు నాటుతామని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతామని, వనాలను నరకనివ్వమని, వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరిస్తామని, రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు 71 వ వనమహోత్సవం లో భాగంగా పెందుర్తి నియోజక వర్గం, గుర్రంపాలెం హోసింగ్ లేఔట్ లో అధికారులు అందరూ మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు మొత్తం 30000 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీశాఖ కన్జర్వేటర్ రామ్ మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఆర్ డి ఓ పి. కిషోర్, డి ఎఫ్ ఓ లక్ష్మణ్, డి ఎఫ్ ఓ అనంతసాగర్, స్క్వాడ్ డి ఎఫ్ ఓ సూర్యనారాయణ , వుడా డి ఎఫ్ ఓ శాంతి స్వరూప్, డి పి ఓ కృష్ణ కుమారి, డ్వామా ఎ పి డి ఆంజనేయులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.