29 నుంచి పత్తికొనుగోళ్లు ప్రారంభం..


Ens Balu
3
కలెక్టరేట్
2020-10-28 15:13:05

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 29వ తేదీన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ తెలిపారు.  బుధవారం జె.సి. ఛాంబరులో సంబంధిత అధికారులతో సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు రాజాం మార్కెట్ యార్డులో  పత్తి కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. శాసన సభ్యులు కంబాల జోగులు ఈ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నట్లు తెలిపారు.  మొదటి రకం పత్తిని క్వింటాలుకు రూ.5825 లు గాను, రెండవ రకం రూ. 5515 లు గాను నిర్ధారించినట్లు చెప్పారు.  తేమ శాతం 8 నుండి 12 వుండాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలోతమ పేర్లను సి.ఎం.యాప్ ద్వారా రైతులు నమోదు చేసుకోవాలన్నారు.  ముందుగా  ఈ క్రాప్ లో నమోదు కావలసి వుంటుందన్నారు.  పత్తి పండించే మండలాలలోని రైతులకు మండల వ్యవసాయ అధికారులు అవగాహన కలిగించాలని  తెలిపారు. పత్తి కొనుగోలు  కేంద్రంలో మద్దతు ధర వివరాలను డిస్ప్లే చేయాలని చెప్పారు.  పత్తి రైతులు సద్వినియోగపరచుకోవాలని కోరారు.  ఈ సమావేశంలో  మార్కెటింగ్ ఎ.డి. బి.శ్రీనివాస రావు,  అడిషనల్ ఎస్.పి. సోమశేఖర్, డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమీషనరు వడ్డి సుందర్, కాటల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ప్రవీణ్, అగ్రికల్చర్ ఎ.డి. సుధారాణి, రాజాం  ఫైర్ ఆఫీసర్ ఎం.కె.ఎం.రాజు, కొత్తూరు ఫైర్ ఆఫీసరు ఐవి.రమణ,  రాజాం మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.