గీతం పూర్తిస్థాయి యూనివర్శిటీ కాదు..
Ens Balu
4
ఈడి కార్యాలయం, వైజాగ్
2020-10-28 15:55:47
ప్రభుత్వ భూములు(40ఎకరాలు)ను అడ్డగోలుగా ఖబ్జాకోరు విద్యాసంస్థ గీతం పూర్తిస్థాయి యూనివర్శిటీ కాదని, అది గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ అని ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు జెటి రామారావు తీవ్రంగా ఆరోపించారు. విశాఖలో ఎన్ఫోర్స్ మెంట్ కార్యాలయం వద్ద ఆయన మీడియతో మాట్లాడారు. గీతం అక్రమ ఆస్తుల విషయంలో ఈడీ ఇప్పటి వరకూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ట్రస్టుపేరుతో విద్యాసంస్థలను నడుపుతూ, హవాలా రూపంలో ఈ విద్యాసంస్థ నిధులను రప్పించు కోవడంతోపాటు విద్యార్ధుల దగ్గర నుంచి కూడాల ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తుందన్నారు. ఒక్కసారి గీతం విషయంలో యూజిసి ఏమని నోటీసులు ఇచ్చిందో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. లేదంటే రేపన్న రోజు ఆ సర్టిఫికేట్లు పనిచేయకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. అక్రమ విద్యా సంస్థ గీతం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేసినట్టుగా కేంద్రం ప్రభుత్వం ఒక్క చర్యకూడా తీసుకోలేదన్నారు. తక్షణమే ఈడీ గీతం అక్రమాస్తుల విషయంలో భూములు, ఆస్తులను అటాచ్ చేయాలన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకూ ట్రస్టు పేరుతో ఎగ్గొట్టిన ఇన్కం టాక్సులను కూడా రాబట్టాలన్నారు. గీతం అన్యాక్రాంతం చేసుకోవాలని చూసిన 40 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే ప్రైవేటు సాఫ్ట్ వేర్ సంస్థలకు గానీ, ఇళ్లు లేని నిరుపేదలకు ఆ భూములను ఇళ్లపట్టాల క్రింద మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గీతం టుబి డీమ్డ్ యూనివర్శిటీ విషయంలో సహకారం అందిస్తూ వస్తున్న అన్ని కేంద్ర శాఖలకు ఈ సంస్థ అక్రమాలపై ఫిర్యాదులు చేయడంతోపాటు, ఉద్యమాన్ని ముందుకి తీసుకెళతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కారెం వినయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.