ఉత్తమ జర్నలిస్టుల పోటీకి దరఖాస్తులు ఆహ్వానం..
Ens Balu
2
VJF Press Club
2020-10-28 16:22:50
జాతీయా పత్రికా దినోత్సవం, జాతీయ పాత్రికేయ దినోత్సవ వేడుకలు నవంబరు 16,17 తేదీల్లో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకుమాను వెంకట వేణు తెలిపారు. బుధవారం డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షుడు నేమాల హేమసుందరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేణు మాట్లాడారు. ఏపీలోని వివిధ ప్రాంతాల వారీగా ఉత్తమ జర్నలిస్టులను ప్రధమ,ద్వితీయ,తృతీయంగా ఎంపికచేసి వారికి సత్కరించి, సన్మానించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా ఎంట్రీలను నవంబర్ 4,లోగా విశాఖపట్నంలోని యూనియన్ కార్యాయానికి పంపాలని కోరారు.కరోనా కట్టడిలో వార్తా కథనాలు కవర్ చేసిన జర్నలిస్టులు ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నారో తెలియజేసే గుర్తింపు కార్డుతో పాటు, వారు కరోనా సమయంలో మార్చి1, నుండి సెప్టెంబరు 30,2020 వరకు కవర్ చేసిన వార్తా కథనాలు, వీడియో క్లింపింగ్‌ను ఎంట్రీ దరఖాస్తుతో పాటు జత చేసి పంపాలన్నారు.దరఖాస్తులను కె. వెంకట వేణు, డోర్ నంబరు 31-27-31/1, పావని పబ్లిక్ స్కూల్ ఎదురుగా, కూర్మన్నపాలెం, విశాఖపట్నం-530046, సెల్-9030246776, చిరునామాకు పంపాలని పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొయిలాడ పరశురాం పాల్గొన్నారు.