కోవిడ్ కంట్రోల్ రూమ్ సేవలు మీకోసమే..జిల్లా కలెక్టర్


Ens Balu
3
Srikakulam
2020-07-22 23:55:10

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ 19  జిల్లా కంట్రోల్ రూమ్ (స్పందన హాల్) నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ కోవిడ్ సమస్యలు, పిర్యాధులు పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు. 08942 240605 ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని ఆయన చెప్పా రు. కంట్రోల్ రూమ్ కు అందిన ఫిర్యాదులు,  సమస్యలపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ - 19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగి హోమ్ ఐసో లేషన్ లో ఉన్నవారు తమ సమస్యలను పరిష్కరించుటకు ప్రత్యేకంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ఈ కేంద్రం జిల్లా మహిళా సమాఖ్య ప్రాంగణంలో ఉందని, సమస్యలు ఉన్నవారు 08942 240615 ఫోన్ నంబరుకు తెలియజేయవచ్చని తెలిపారు.
సిఫార్సు