ప్రత్యేకాధికారులు సచివాలయాలను పర్యవేక్షించాలి..
Ens Balu
2
జివిఎంసీ కార్యాలయం
2020-10-28 19:43:02
జివిఎంసీ పరిధిలోని వార్డు సచివాలయ ప్రత్యేక అధికారులు సచివాలయలను నిత్యం పర్యవేక్షించాలాని జివిఎంసి కమిషనర్ డాక్టరు జి. సృజన ఆదేశించారు. బుదవారం, జివిఎంసిలో వార్డు ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రత్యేక అధికారులు సచివాలయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలకు సంబందించిన వివిధ పోస్టర్లను ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు. ప్రతీ సచివాలయ పరిధిలో ఎక్కువ తక్కువ కాకుండా నిబంధనల ప్రకారం కనీసం 1000 నుండి 1200 వరకు ఇల్లు వుండే విధంగా మ్యాపింగు చేసి వాటి జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. కొన్ని సచివాలయాలలో వార్డు కార్యదర్శులు డైరీలో సరిగా వ్రాయడం లేదని, వారు బయటకు వెళ్ళినప్పుడు ఏ పనిపై వెళ్ళారో డైరీలో పూర్తీ వివరాలను వ్రాయాలన్నారు. నవరత్నాలలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ప్రజలు సచివాలయాలకు వెళ్తే అక్కడ మన పని అవుతుందనే నమ్మకం కలగాలన్నారు. వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులు, ఎమినిటీ కార్యదర్శులు, ప్లానింగ్ కార్యదర్శులు వారి పరిధిలో క్షేత్రస్థాయిలో సాయంత్రం పర్యటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఆశా జ్యోతి, డాక్టరు వి. సన్యాసి రావు, ప్రధాన వైద్య అధికారి డాక్టరు కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, పి.డి.(యు.సి.డి) వై. శ్రీనివాసరరావు, డి.సి.(ఆర్). ఫణిరాం, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, అందరు జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.