శతశాతం పన్నులు వసూలు చేయాలి..


Ens Balu
3
జివిఎంసి కార్యాలయం
2020-10-28 20:55:48

జివిఎంసి పరిధిలో వివిధ పన్నులను శత శాతం వసూలు చేయాలని జివిఎం సి కమిషనర్ డాక్టరు జి. సృజన అధికారులను ఆదేశించారు. బుదవారం, జివియం సి సమావేశమందిరంలో జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. 2020 - 21 ఆర్ధిక సంవత్సరమునకు సంబందించి ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, నీటి చార్జీలు, కళ్యాణమండపాలు, షాపులు, మార్కెట్ల నుండి రావలసిన పన్నులు పూర్తిగా వసూలు చేయాలని ఆదేశించారు. జివిఎంసికి రావాల్సిన అదాయం సకాలంలో వసూలు చేయకపోతే ప్రజలకు అందించవలసిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయన్నారు.  తక్కువ శాతం పన్ను వసూలు చేసిన రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లును తీవ్రంగా హెచ్చరించారు.  అదనపు కమిషనరు ఆశా జ్యోతి మాట్లాడుతూ నూతనంగా కట్టిన భవనాలకు, వినియోగ మార్పిడి జరిగిన భవనాలు, పన్ను పరిధిలోకి రాని ఖాళీ స్థలాలను గుర్తించి, వెంటనే పన్నులు విధించాలని, మార్చి- 2021 నాటికి 25% పన్ను ఆదాయం పెరగాలని, రెవెన్యూ అధికారులకు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ అశా జ్యోతి, డి.సి.(ఆర్). ఫణిరాం, అందరు జోనల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.