పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..


Ens Balu
2
Tirupati
2020-10-28 21:11:27

ప్రజలను 24 గంటలూ రక్షించాలని చూసేది ఒక్క పోలీస్ మాత్రమేనని తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ అధ్వర్యంలో స్థానిక పోలీస్ గ్రౌండ్ నుంచి బాలాజీ కాలనీ వరకు  అమరవీరులను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసులను, వారి త్యాగాలు ఉట్టి పడే విధంగా పోలీస్ బ్యాండ్ కళాకారులతో మ్యూజిక్ ద్వారా తియ్యని దేశభక్తి గీతాలను ఆలపించారు.   ఈ సందర్బంగా జిల్లా యస్.పి  మాట్లాడుతూ, పోలీసుల మొక్క సేవ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అవసరం వస్తుందన్నారు. ఈ సందర్భాలలో కొన్ని కష్టమైనా, ప్రజా రక్షణ కోసం త్యాగాలు కూడా చేస్తామన్నారు. 24x7 ప్రజా సేవకోసం ముందుండి రక్షణ కల్పించేది ఒక్క పోలీస్ శాఖ మాత్రమేనన్నారు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అది బయటకు కనబడకుండా ఎంతో మంది ఇప్పటికి విధులు నిర్వహిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. వీరి త్యాగాలను ఎప్పటికి మర్చిపోకూడదని యస్.పి సూచించారు.  ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ యస్.పి  సుప్రజ, యస్.బి  డి.యస్.పి  గంగయ్య , డి.యస్.పి లు ఈస్ట్ మురళి కృష్ణ, క్రైమ్ మురలిదర్, ఏ.ఆర్  డి.యస్.పి లు నంద కిశోర్, లక్ష్మణ్ కుమార్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.