ఒకరి రక్తదానం..ఐదుగురికి ప్రాణదానం..


Ens Balu
3
Tirupati
2020-10-28 21:31:29

డబ్బు దానం చేస్తే ఆకలి తీరుతుంది..కానీ అదే రక్త దానం చేస్తే మీరు ఐదుగురు జీవితాలను కాపడానికి వీలుపడుతుందని తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి అన్నారు.   పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం  ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు.  ఈ సందర్బంగా  యస్.పి మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితిలో రక్తం దొరకక, రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలలో ఎందరో ప్రాణాలు పోగొట్టు కుంటున్నారని, ఇలాంటి పరిస్థుతలను కొంతవరకైనా మెరుగు పరచాలనే ఉద్దేశంతో అర్బన్ జిల్లా పోలీసులు పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ వారోత్సవాలలోనే కాకుండా భవిష్యత్తులో జిల్లా మొత్తం రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా లభించిన  రక్త నిధిని అత్యవసర పరిస్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉపయోగకరంగా ఉండేటట్లు చేస్తామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజా స్రవంతిలో పోలీసులు మెరుగైన సేవలు చేసేందుకు పోలీసులకు - ప్రజలకు సత్సంబంధాలు ఏర్పడి ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పడుతాయన్నారు.    అనంతరం రక్తదానం చేసిన వారికి జిల్లా యస్.పి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డి.యస్.పి చంద్రశేఖర్, సి.ఐ లు అంజు యాదవ్, అమరనాథ్ రెడ్డి, యస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.