సోలార్ పవర్ ప్రాజెక్టుతో జీవిఎంసీకి ఆదాయం..
Ens Balu
3
ముడసర్లోవ
2020-10-28 21:44:00
విశాఖలో ముడసర్లోవ జలాశయంలో ఏర్పరచిన 2 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఇపిడిసిఎల్ గ్రిడ్ తో అనుసంధానం జరిగిందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. బుధవారం మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, జివిఎం కమిషనర్ తో కలిసి ఈ సోలార్ విద్యుత్ ప్లాంటను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు వలన ఇపిడిసిఎల్ కి చెల్లించవలసిన విద్యుత్ చార్జీలు జివిఎంసికి అదా అవున్నాయని చెప్పారు. అనంతరం సౌర విద్యుత్ ప్రాజెక్టు వివరాలను జివిఎంసి కమిషనర్ మంత్రులకు వివరించారు. 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టుని కూడా ఇపిడిసిఎల్ తో త్వరలో అనుసంధానం చేస్తామని వివరించారు. ముడసర్లోవ పార్కును సందర్శించిన మంత్రులు పార్కు అభివృద్ధికి గాను డిపిఆర్ తయారు చేయవలసినదిగా జివిఎంసి, విఎంఆర్ డి ఏ కమిషనర్లను ఆదేశించారు. జివిఎంసి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి సమావేశమందిరంలో ఏపిడిఆర్పి ప్రాజెక్టు క్రింద ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయం 110 కోట్ల తో విశాఖ బీచ్ లో పునరాభివృద్ది ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోతున్న వివిధ పనులను కమిషనర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులు కమిషనర్ తెలియజేశారు. 18 నెలల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టు పనులను పూర్తీ చేయాలని, పనులు జరుగుచున్న కాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు కమిషనరుకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు అశా జ్యోతి, వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కె. ఎస్.ఎల్. జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ కుమార్, కె.వి.ఎన్. రవి తదితర అధికారులు పాల్గొన్నారు.