ప్రగతి సాధింకపోతే ఇంటికి పంపుతాం..


Ens Balu
2
Tirupati
2020-10-29 18:29:17

వార్డు సచివాలయ సెక్రెటరీ లు ప్రగతిపై దృష్టి పెట్టాలని, మీసేవా కార్యాలయాలతో పోటీ పడి ప్రజలకు పౌర సేవలందించాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా  అన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు సెక్రెటరీలు, వాలంటీర్లతో వారంత సమీక్షలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పౌర సేవల ధరఖాస్తులు  పట్టణ ప్రాంతాలలో మీ సేవా కేంద్రాలలో అత్యధికం వస్తున్నాయని సచివాలయ నుండి కేవలం 10 శాతం మాత్రమే ఉందని అన్నారు. మీ సేవా నిర్వాహకులు ఇద్దరు, ముగ్గురు సిబ్బందితో  ఒక్కొక్కరు 40 పైగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అక్కడ వారు ఇచ్చే ఆతిధ్యం ఏమి? వార్డు సచివాలయాల్లో ఇంతమంది సెక్రెటరీలు, వాలంటీర్లు ఉంది ప్రగతి చూపలేక పోవడానికి మీరే కారణం వెతకాలని అన్నారు. జిడి నెల్లూరు మండలం గ్రామ సచివాలయాలు 27 వేల పౌర సేవల ధరఖాస్తులు స్వీకరించారు. దీన్ని బట్టి మీ దగ్గర పూర్ పర్ఫార్మన్స్ ఉందని అర్థం అవుతున్నదని అన్నారు.  వైఎస్ఆర్ చేయూత  మహిళకు ఆర్థిక సహాయం అందించారు. దీనికి తోడు  బ్యాంకుల నుండి మాచింగ్ గ్రాంట్ ఇప్పించి ఏదైనా శాశ్వత ఆర్థిక భరోసా కల్పించారా అంటే లేదు . జగనన్నతోడు ముఖ్యమంత్రి నవంబర్ 6 న ప్రారంభించనున్నారు. జిల్లాలో 49 వేల ధరఖాస్తులు వస్తే, తిరుపతి నగరపాలక పరిధిలో 3 వేలు మాత్రమే చేశారు, జనాభా 4 లక్షలు పైగా  ఉంది, ఎంతో మందికి తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్నారు. వై ఎస్ ఆర్ భీమా అమల్లోకి వచ్చింది అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలి లేదంటే పెద్దవాళ్ళు ఆపదలో ఆర్థిక సహాయం కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి రోజూ  సచివాలయాలపై సమీక్షలు జరుపుతున్నాము, త్వరలో ప్రగతి చూపించాలని అన్నారు.   ఈ సమీక్షలో తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి , అదనపు కమీషనర్ హరిత, ఎం.ఇ. చంద్రశేఖర్, సచివాలయాల ఇంచార్జి రవి, వార్డు సెక్రెటరీలు, వాలంటీర్లు పాల్గొన్నారు.