వైఎస్సార్సీపీకి జై..టిడిపి, జనసేనకు బై బై..
Ens Balu
5
Macherla
2020-10-29 19:03:13
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి చెప్పారు. గురువారం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టిడిపి,జనసేన పార్టీలను వీడి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిడిపి, జనసేన పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదనే విషయం తెలుసుకున్నవారంతా వైఎస్సార్సీపీలో చేరుతున్నారని ఇదే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నిదర్శమని అన్నారు. ఆ కుటుంబాలకు చెందిన వారిని రామక్రిష్ణారెడ్డి సాదరంగా కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో కూరాకుల మల్లికార్జునరావు, కూరాకుల సాంబయ్య, సంక అంజయ్య, యాదం రామకోటేశ్వరరావు, కూరాకుల సాంబయ్య, పాశం బ్రహ్మయ్య, కూరాకుల సాంబశివరావు, కూరాకుల కోటేశ్వరరావు, ఉప్పు నారాయణ, జెవిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు..