కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..
Ens Balu
3
జివిఎంసీ కార్యాలయం
2020-10-29 20:39:53
జివిఎంసీ పరిధిలోని పాఠశాలలు కోవిడ్ నిబందనల అనుసరించి తెరవాలని జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం, జివిఎంసి పరిధిలో ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నవంబరు రెండవ తేది నుండి పాఠశాలలు తెరవబడుచున్న నేపధ్యంలో కోవిడ్ దృష్ట్యా ప్రభుత్వ నిబందనల ప్రకారం పాఠశాలలలో విద్యార్దీ విద్యార్దినులు తగు జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. ముఖ్యంగా 1, 3, 5, 7 తరగతులు ఒక రోజు, 2, 4, 6, 8 తరగతులు మరో రోజు, 9, 10 తరగతులు ప్రతీ రోజూ తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాల ఆవరణలో కోవిడ్ నిబందనలకు సంబందించి ఫ్లెక్షీలు ఏర్పాటు చేయాలనీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు జరిపి అనుమానం ఉన్న పిల్లలను, ఉపాధ్యాయులు లోనికి అనుమతి ఇవ్వకూడదన్నారు. తరగతి గదులలో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, చాక్ పీసులు, రిజిస్టర్లు వంటివి ఒకరి నుండి మరొకరికి మార్పులు చేయకుండా చూడాలని అన్నారు. కరచాలం కూడా ఎవ్వరూ చేయకూడదన్నారు. మాస్కు లేనిదే లోనికి ఎవ్వర్నీ అనుమతి ఇవ్వకూడదని, మొదటి, ఆఖరి పీరియడ్ లో తప్పని సరిగా కోవిడ్ పై ప్రత్యేకమైన బోధనలు చేయాలని, క్లాసులో 20 మంది పిల్లలు ఉండే విధంగా ప్లాను చేసుకోవాలని, పిల్లలకు ఇచ్చిన వర్కు బ్లాక్ బ్బోర్డుపై వ్రాసి వారినే సరిచేసుకొనే విధంగా చూడాలన్నారు. మొదటి పది రొజులూ ఏ.ఎన్.ఎం.ల ద్వారా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసే పద్దతి క్షుణ్ణంగా తెలుసుకోవాలని, దీని కోసం మీలో చలాకీగా ఉన్న టీచరును రీసోర్సు పెర్సన్ గా ఏర్పాటు చేసుకోవాలని ప్రతీ రోజూ సాయంత్రం పాఠశాలలో అన్ని తరగతి గదులకు శానిటైజేషన్ చేసి శుభ్రపరచాలన్నారు. అలాగే, నాడు – నేడు పనులు పూర్తీ కావస్తున్నాయని, జగనన్న విద్యా కానుకలు అందరికి అందించేలా చూడాలన్నారు.
అదనపు కమిషనర్ మాట్లాడుతూ, గత 7 నెలలుగా పిల్లలు ఇంటివద్ద ఉండడం వలన వారిలో క్రమశిక్షణ లోపిస్తుందని పిల్లలకు మీరే ఓపికతో క్రమశిక్షణ నేర్పాలన్నారు. దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి రేపిడ్ టెస్టు చేయించాలని, తరగతి గదులలో ఒక గదిని ఐసోలేషన్ గదిగా ఉపయోగించాలన్నారు. ప్రతీ ప్రధానోపాధ్యాయులు వద్ద మీ పరిధిలో ఏ.ఎన్.ఎం., మలేరియా విభాగం, శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్లు ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టరు వి. సన్యాసి రావు, డి.ఇ.ఓ. శ్రీనివాస రావు, జివిఎంసి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.