విసిఐసి సౌత్ బ్లాక్ సర్వే సత్వం పూర్తిచేయాలి..
Ens Balu
3
Tirupati
2020-10-29 20:57:54
చిత్తూరుజిల్లాలో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ స్టార్టప్ ఏరియా భూసేకరణ సర్వే త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త సూచించారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కనకనరసారెడ్డి కలసి సంభదిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 న ఎపిఐఐసి డైరెక్టర్ సమీక్ష జిల్లాలో జరిగిందని ఆమేరకు ఈ నెలఖారునకు మనం 400 ఎకరాల సర్వే పూర్తికావలని నిర్దేశించామని ఆమేరకు పూర్తికావలని అన్నారు. ఈ సర్వే తొట్టంబేడు మండలం రౌతు సూరమాల, బి.ఎన్.కండ్రిగ కొత్తపాలెం, ఆలత్తూరు ప్రాంతాల భూసేకరణ పై ఆర్డీఓ వివరించారు. జిల్లాలో తిరుపతి డివిజన్లలో విసిఐసి కారిడార్ 24 వేల ఏకరాలుగా వుందని, నార్త్ బ్లాక్ 11 వేల ఎకరాలు ,సౌత్ బ్లాక్ 13 వేల ఎకరాలుగా వుందని వివరించారు. స్టార్టప్ ఏరియా కు ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు.ఈ సమీక్షలో ఎపీఐఐసి జోనల్ మేనేజర్ ఎల్.రామ్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి,సంభందిత తహసీల్దార్లు పాల్గొన్నారు.