కేంద్రప్రభుత్వ పథకాలపై త్వరలో రివ్యూ..


Ens Balu
5
కలెక్టరేట్
2020-10-29 21:19:11

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాల అమలు తీరుపై జిల్లా అభివృద్ది కోఆర్డినేషన్ మరియు మోనటరింగ్ కమిటీ ప్రిలిమినరీ సమావేశం స్ధానిక పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అధ్యక్షతన త్వరలో జరగనున్నట్లు సంయుక్త కలక్టరు (ఆసరా) జె. వెంకటరావు తెలిపారు.  డిఆర్డిఎ సమావేశ మందిరంలో గురువారం ఇందుకు సంబంధించిన సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు.  ప్రతి శాఖకు చెందిన ఉన్నతాధికారులు వారి శాఖలో అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వ పధకాలపై పూర్తిగా అవగాహన కలిగివుండాలన్నారు.  ఈ కమిటీలో మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు  సభ్యులుగా ఉంటారన్నారు. వారు వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే బాధ్యత ఆయా శాఖల అధికారులదేనని స్పష్టం చేసారు.  ఈ సమావేశం కోసం అవసరమగు నివేదికలను నవంబరు 2వ తేదీలోగా నిర్ధేశిత ప్రొఫార్మాలో సమర్పించాలని సూచించారు. పలు శాఖల ద్వారా అమలు చేస్తున్న సుమారు 30 కేంద్ర ప్రభుత్వ పధకాలపై చర్చ జరగవచ్చన్నారు.  ప్రతి పధకం పట్ల అధికారులు అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు.   ఈ సమావేశంలో డిఆర్డిఎ ప్రాజక్టు డైరక్టరు కె. సుబ్బారావు, జిల్లా పరిషత్ సిఇఓ టి. వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ జయశ్రీ, గృహ నిర్మాణ సంస్ద పిడి రమణమూర్తి, ఇపిడిసియల్ ఎస్ఇ విష్టు తదితర అధికారులు పాల్గొన్నారు.