కాకినాడ గొట్టం కాజాకి 130ఏళ్లు..


Ens Balu
2
Kakinada
2020-10-30 12:13:12

గొట్టం కాజా అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచదేశాల్లో కూడా మంచి డిమాండ్ వుంది..తీపిని ఇష్టపడేవారు లొట్టలేసుకుంటూ ఈ ఖాజాలు మహా బాగా ఆరగిస్తారు. ఆ గొట్టం కాజాపుట్టినిల్లు కాకినాడ. ఇపుడు కాకినాడ గొట్టం కాజాకి 130 గడిచాయి. ఈ సందర్బంగా ఆ తీపిగుర్తు ఈఎన్ఎస్ లైవ్ పాఠకులకు తెలిజేసే ప్రయత్నమిది.  చిట్టి కాజా  కాకినాడ అంటే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేది కాకినాడ కాజానే. అందులోనూ కోటయ్య కాజా అంటే ఇంకాఎక్కువ పేరు. ఈ ఖ్యాతి ఖండాంతరాలు కూడా దాటింది. విదేశాల్లో ఉండే తెలుగువారు కూడా కాకినాడ కాజాను రుచి చూడాలనుకుంటారు. గొట్టం కాజాను కొరకగానే అందులో ఉన్న పాకం నోటిని తియ్యగా చేసేస్తుంది. ఆ థ్రిల్ తినే వారికి మాత్రమే తెలుస్తుందంటారు.   తెనాలి నుండి వచ్చిన కోటయ్య అనే వ్యక్తి1891 నుండి  వీటిని తయారు చేయగా, బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత ఇతరులు కూడా వీటిని తయారు చేయడం మొదలు పెట్టారు. కాకినాడలోనే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఇలాంటి గొట్టం కాజాలు దొరుకుతున్నాయి. కానీ కాకినాడ కాజాకి వున్న డిమాండ్ మరెక్కడా దొరకదు. స్వీట్ అంటే ఇష్టపడే వారు తప్పకుండా వీటిని రుచి చూస్తారు. అందుకే పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా సుమారు  130 సంవత్సరాల చరిత్ర  కలిగిన కోటయ్య కాజాలకు ఉన్న ప్రత్యేకతకు దృష్టిలో పెట్టుకుని ఆ పేరుతో పోస్టల్ కవర్‌ను రిలీజ్ చేసింది. గొట్టం కాజా ప్రత్యేకత ఏంటంటే , కొబ్బరి బొండం లో నీళ్ళు ఎలా అయితే ఉంటాయో, ఈ గొట్టం కాజా లో జ్యూస్ అల ఉంటుంది.కోటయ్య కాజా దుకాణంతో ప్రసిద్ధి చెందిన ఈ వీధిని కోటయ్య స్ట్రీట్ అనే పిలుస్తారు. ఇక్కడ కోటయ్య తరువాత వారి కుమారుల ద్వారా అతి పెద్ద దుకాణ సముదాయం నడుస్తోంది కాకినాడలో..ఇంతటి చరిత్ర వుంది కాకినాడ ఖాజాకి. ఆతరువాత వాడుకలోకి వచ్చిన మడతకాజా, చిట్టికాజాలు వచ్చినా అవి అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు..