కోమలమ్మ సత్రం కార్యాలయం మార్చండి..


Ens Balu
8
Tirupati
2020-10-30 19:30:29

తిరుపతిలోని కోమలమ్మ సత్రాన్ని  జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) సదా భార్గ‌వి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ, తిరుపతి నగరం నడిబొడ్డున 95 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న కోమలమ్మ సత్రం నిరుపయోగం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సత్రాన్ని తగిన కార్యాలయానికి కేటాయించాలని జెఈఓ సూచించారు. తద్వారా ఈ సత్రానికి ఒక గుర్తింపు వస్తుందన్నారు. లేదంటో ఎంతో విలువైన ప్రదేశం నిరుపయోగంగా మారిపోవడంతో పాటు, భవనాలు శిధిల స్థితికి చేరుకుంటాయన్నారు. టిటిడికి చెందిన ఏదో విభాగాన్ని ఇక్కడ ఏదోఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ సత్రం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందన్నారు. అదేవిధంగా పురాణ ఇతిహాస ప్రాజెక్టును పరిశీలించారు. టిటిడి ఈఓ ఆదేశాల మేరకు రథసప్తమి లోపు పురాణాల ముద్రణను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  జెఈఓ వెంట ఆయా విభాగాల అధికారులు ఉన్నారు.