24 గంటల్లో.. 84,401 కేసులు నమోదు..


Ens Balu
4
Velagapudi
2020-10-30 19:52:07

ఆంధ్రప్రదేశ్‌లో  గడిచిన 24 గంటల్లో 84,401 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,886 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,20,565కి చేరింది. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,88,375గా ఉంది. 24 గంటల్లో కరోనాతో 17 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 6,676కు చేరుకుంది.  రాష్ట్రంలో ప్ర‌స్తుతం 25,514 యాక్టివ్ కేసులున్న‌ట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. ఏపీలో కరోనా పాజిటివ్‌ రేటు  10.33 శాతం ఉండగా.. ప్రతీ మిలియన్‌ జనాభాకు 1,48,818 కరోనా పరీక్షలు నిర్వహించారు.  ఇప్ఫటివరకు రాష్ట్రంలో 79,46,860 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌లో పేర్కొంది. అంతేకాకుండా కరోనా వైరస్ నియంత్రణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కూడా ప్రభుత్వం కోరుతోంది. మాస్కు, సామాజిక దూరం తప్పని సరి అని కూడా ప్రభుత్వం ప్రజలకు సూచిస్తుంది.