గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలి..


Ens Balu
8
Vizianagaram
2020-10-30 20:50:01

గర్భిణీ వసతి గృహంలో గర్భిణీలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని డిప్యూటీ డి. ఎం అండ్ హెచ్ ఓ రవికుమార్ పేర్కొన్నారు.  డిప్యూటీ డి. ఎం అండ్ హెచ్ ఓ రవికుమార్ శుక్రవారం సాలూరు వై టి సి లో నిర్వహిస్తున్న గర్భిణీ వసతి గృహన్ని పర్యటించారు, ముందుగా గర్భిణీలతో మాట్లాడుతూ వైద్యం, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి రోజు వారి అందిస్తున్న ఆహార వివరాలు, వైద్య పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం  డిప్యూటీ డి. ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ గారి ఆదేశాలననుసరించి పర్యటించడం జరిగిందన్నారు, అలాగే పూర్తి స్థాయి లో వైద్యం పరీక్షలు నిర్వహించాలని అలాగే వారికి కావలసిన మందులు అందజేయాలని సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు. ఎ ఎన్ ఎం, ఆశా వర్కర్లు 7 నెలలు నిండిన గర్భిణిలకు వారికి దగ్గరలో.ఉన్న గర్భిణీ వసతి గృహంలో చేర్పించి విధంగా చర్యలు చేపట్టాలన్నారు అందులో భాగంగా వారికి గర్భిణీ వసతి గృహాలపై అవగాహన కల్పించాలన్నారు. వైద్య సిబ్బంది అందరూ ప్రాజెక్ట్ అధికారి వారి ఆదేసాలనానుసరించి విధులు నిర్వహించాలని తద్వారా గిరిజన మహిళలకు సుఖ ప్రసవం జరిగేలా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా విధులు నిర్వహించాలని కొరారు.