పండుగలా రాష్ట్ర అవతరణ దినోత్సవం..


Ens Balu
3
Vizianagaram
2020-10-30 20:56:12

నవంబర్ 01న నిర్వహించబోయే రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సంయుక్త కలెక్టర్ జె.వెంకటరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్డీవో భవానీ శంకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, పర్యాటక అధికారి లక్ష్మీ నారాయణ శుక్రవారం పరిశీలించారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరుపై సంబంధిత అధికారులతో చర్చించారు. తగిన సూచనలు చేశారు. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు పటిష్ఠంగా చేస్తున్నట్లు జేసీ వెంకటరావు పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం నిర్వహించేలా ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులతో సమీక్ష చేస్తున్నామని చెప్పారు. కరోనా నేపద్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కార్యక్రమం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్టు జెసి వివరించారు..