కరోనాలో పోలీసుల సేవలు మరువలేనివి..


Ens Balu
3
Anakapalle
2020-10-30 20:59:17

కరోనా, లాక్ డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు సేవలు మరువలేనివని  రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత  ప్రశంసించారు. శుక్రవారం అనకాపల్లిలో మోడల్ పోలీస్ స్టేషన్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. పోలీసులు తమ కుటుంబాన్ని వదిలి రోడ్లపై డ్యూటీ లు చేశారన్నారు. వారి ప్రాణాలకు తెగించి కరోనా విపత్కర సమయంలో పోలీసులు పనిచేశారు. చాలా మంది పోలీసులు కరోనా భారిన పడి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. పోలీసులు ఎంతో నిబద్ధతతో పనిచేయడం వలనే మరణాల సంఖ్య తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. దేశములోనే మన రాష్ట్ర పోలీవులకు అత్యధిక అవార్డ్ లు వస్తున్నాయని, జాతీయ స్థాయిలో 84 అవార్డ్ ల్లో 48 అవార్డ్ లు మన రాష్ట్ర పోలీసులకు రావడం నిజంగా గర్వకారణమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ నిబద్ధతతో పనిచేసి అవార్డ్ లు సాధించారని మెచ్చుకున్నారు. అధికారంలో కి వచ్చిన వెంటనే సీఎం జగన్ గారు పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని,తప్పు చేసిన వారెవరైనప్పటికీ వారిని వదిలే ప్రసక్తి లేదనని తెలిపారు. పోలీసు శాఖ పూర్తి స్వేచ్ఛగా, న్యాయ బద్దంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని,  ముఖ్యమంత్రి  మహిళల భద్రత కు పెద్దపీట వేశారని చెప్పారు.అందులో భాగంగా రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్ లను ప్రారంభించాము. త్వరతిగతిన కేస్ లు పరిష్కరించడం కోసం కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, దిశ యాప్, ఏపి పోలీస్ సేవ యాప్, ఇలా అనేక కొత్త అవిష్కరణలను తీసుకొచ్చామని, ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలు దాదాపు 67 రకాల సేవలను పొందవచ్చని అన్నారు. మన రాష్ట్రంలో జీరో ఎఫ్ ఐ ఆర్  తీసుకురావడం జరిగిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ హాఫ్ ను సీఎం  ప్రకటించారన్నారు. కార్పొరేట్ బిల్డింగ్ లను తలదన్నేలా మోడల్ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసామని, ప్రజలు ధైర్యంగా, స్వేచ్చా వాతావరణంలో వెళ్లేలా పోలీస్ స్టేషన్ లు రూ పొందాయన్నారు. రానున్న రోజుల్లో మరింత ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ను తీసుకొస్తామన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ ను నియమించడంతో పోలీస్ వ్యవస్థలో మహిళలకు సముచిత స్థానం కల్పించిన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ బి.సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.