పాఠశాలల్లో కరోనాజాగ్రత్తలు పటిష్టంగా తీసుకోవాలి..
Ens Balu
2
Gopalapatnam
2020-10-31 13:27:46
సోమవారం నుంచి పాఠశాలలు తెరుస్తున్న ద్రుష్ట్యా అన్ని కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అధికారులను ఆదేశించారు. శనివారం గోపాలపట్నం ప్రభుత్వ ఉన్నత పాటశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా రెండవ దశ ప్రారంభం అయినందున ప్రతీ విద్యార్ధికి మాస్కు, సామాజిక దూరం అలవాటు చేయాలన్నారు. బడికి వచ్చే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లల గురించి తీసుకున్న జాగ్రత్తలు మీద , నివారణ చర్యలు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పాటశాల ప్రాంగణంలో జరుగుతున్న కొన్ని నిర్మాణ, రిపేర్ పనులను పర్యవేక్షించారు. పనులను సత్వరమే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం , పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది, పాల్గొన్నారు.