వాల్మీకి జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శం..
Ens Balu
5
Srikakulam
2020-10-31 14:20:28
వాల్మీకి మహర్షి జీవితం అందరకీ ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన చరిత్ర తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్టేషన్లు మరియు స్టాంపులు శాఖామాత్యులు ధర్మాన క్రిష్ణదాస్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం శనివారం ఉదయం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ ఒక బోయవాని ఇంట జన్మించిన వాల్మీకి మహర్షిగా మారి, పవిత్ర రామాయణ గ్రంథాన్ని మనకు అందించారని తెలిపారు. ఆటన రచించిన పవిత్ర రామాయణ గ్రంథం యావత్ సమాజానికి మార్గదర్శకమన్నారు. ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా మార్పు చెందవచ్చని వాల్మీకి మహర్షి నిరూపించారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి బి.సిలకు పెద్దపీట వేశారని అన్నారు. తనను ఉప ముఖ్యమంత్రిగా, తమ్మినేని సీతారాంకు శాసనసభ స్పీకర్ గా నియమించిన సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. 56 బి.సి కులాలకు కార్పొరేషన్ లను నియమించి, బిసిల అభ్యున్నతికి ముఖ్యమంత్రి సంకల్పించినట్లు ఆయన వివరించారు.
శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ వాల్మీకి గొప్ప మహర్షి అని కొనియాడారు. పవిత్ర గ్రంథమైన రామాయాణాన్ని రచించారని, రామాయణం గొప్ప నీతి, నియమాలను తెలియజేస్తుందని వివరించారు. వ్యక్తి, సామాజిక నీతి, నడవడికను నేర్పిన గొప్ప కావ్యం రామాయణం అని సభాపతి ఈ సందర్భంగా గుర్తుచేసారు. భారతీయ సామాజిక ధర్మానికి రామాయణం గొప్ప ప్రాతిపదిక అని కొనియాడారు. ఎస్.సి, ఎస్.టి, బి.సిలకు ఆది గ్రంధాలలో గొప్ప మూలాలు ఉన్నాయని, శ్లోకాలకు ఆది గురువు వాల్మీకి అని చెప్పారు. ఎస్.సి, ఎస్.టి, బి.సిలు ఆది కాలం నుండి పథ నిర్దేశకులని, గొప్ప గ్రంధాలను రచించారని తెలిపారు. రామాయణం వంటి పవిత్ర గంధాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ప్రతి పల్లె, ప్రతి వీధిలో జరగాలని, ఆయన చరిత్రను ప్రజలకు తెలియజేయాలని ఆశాభావం వ్యక్తం చేసారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జీవితం నుండి ప్రతీ ఒక్కరూ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. మంచి నిర్ణయం జీవితాన్ని మార్చుతుందని, వాల్మీకి నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చివేసిందని గుర్తుచేసారు. కష్టాలు అందరికీ వస్తాయని,. సరైన సమయంలో మంచి నిర్ణయాలే కష్టాలను గట్టెక్కిస్తాయని కలెక్టర్ వివరించారు. ముందుగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, బి.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, జిల్లా బిసి సంక్షేమ అధికారి. కె.కృత్తిక, ఎస్.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు, సెట్ శ్రీ సి.ఇ.ఓ. జి.శ్రీనివాసరావు, తూర్పు కాపు, పొందర, శ్రీ శయన, కాళింగ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన మామిడి శ్రీకాంత్, రాజాపు అప్పన్న, చీపురు కృష్ణ, పేరాడ తిలక్, బిసి సంఘాల నాయకులు పి.సి.చంద్రపతి రావు, సురంగి మోహన్ రావు, బి.సి.నాయకులు పిట్ట చంద్రపతిరావు, ఎం.నారాయణరావు, అమీదుల్లా బేగ్, కె.నరసింగరావు, జి.కృష్ణ, జె.రామారావు, గజపతి రావు, ఎల్.నాగరాజు, జె.చిన్నారావు, మైలపల్లి పోలీసు, పి.రమణమూర్తి, పి.సుగుణా రెడ్డి, పద్మ, నాగమణి, వాసవి, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.