రేపు ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-31 18:23:21
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆది వారం ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు శని వారం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆది వారం ఉదయం 8.30 గంటలకు వేడుకలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకు నగర పాలక సంస్ధ కార్యాలయం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలాలంకరణ కార్యక్రమంతో ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పతాకావిష్కరణతోపాటు అమరజీవి చిత్రపటానికి పుష్పాంజలి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 9 గంటల నుండి 10.30 గంటల వరకు అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్సు జరుగుతుందని అనంతరం బాపూజి కళామందిర్ లో సభాకార్యక్రమం , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొంటారని ఆయన వివరించారు.