ప్రగతిభారత్ నిరుద్యోగుల పాలిట ఆశాదీపం..


Ens Balu
3
Visakhapatnam
2020-10-31 18:32:18

ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, యువతకు ఉద్యోగ ఉపాది శిక్షణలు ఇవ్వడం అభినందనీయమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు వి.విజయసాయిరెడ్డిని శ్రీనుబాబు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చాలా ట్రస్టులు, సొసైటీలకు మించిన సేవా కార్యక్రమాలు, యువతను అభివ్రుద్ధిచేసే శిక్షణలు ఒక్క ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వ శాఖలకు ధీటుగా ఈ సంస్ధ ద్వారా నిరుద్యోగ యువతకు దారిచూపే ఉపాదిని చూపిస్తున్నారన్నారు. అలాంటి ఫౌండేషన్ మరెన్నో వార్షికోత్సవాలు నిర్వహించాలని శ్రీనుబాగు కోరారు. అనంతరం రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ను గంట్ల ఘనంగా సత్కరించారు.