ఆంధ్రరాష్ట్ర అవతరణకు సర్వం సిద్ధం..


Ens Balu
3
Vizianagaram
2020-10-31 19:16:37

నవంబర్ 1, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ  ఉత్సవాలకు స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంను సిద్ధం చేసారు.  ఏర్పాట్లను శనివారం ఇంచార్జ్ కలెక్టర్ డా. జి.సి  కిషోర్ కుమార్  సంయుక్త కలెక్టర్ జే.వెంకట రావు, రెవిన్యూ డివిజినల్ అధికారి గణపతి రావు ఇతర అధికారులతో కలసి పరిశీలించారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి ఉదయం 9.30 గంటలకు  తెలుగు తల్లి విగ్రహానికి పూల మాలంకరణ గావించి,  జాతీయ పతాకాన్ని  ఆవిష్కరిస్తారని, అనంతరం వారి సందేశాన్ని అందిస్తారని తెలిపారు.  కోవిడ్ నిబందనలతో కార్యక్రమాలు జరుగుతాయని, సీటింగ్ భౌతిక దూరం ఉండేలా  ఏర్పాటు  చేయాలన్నారు.  హాల్ మొత్తం శానిటైస్  చేయించాలని సూచించారు.  ఆడిటోరియం ను మామిడి తోరణాలతో పూల మాలలతో అలంకరించాలని, ఉద్యాన శాఖాధికారి కి,  ప్రవేశం వద్ద రంగవల్లులు వేయాలని, టాయిలెట్ లను శుభ్రంగా ఉంచాలని, తాగు నీటిని అందుబాటులో ఉంచాలని, పారిశుధ్యం బాగుండాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు.  వేదిక వద్ద వేసిన కుర్చీలను పరిశీలించి  కుర్చీల మధ్య దూరం ఉండాలని తెలిపారు. మంత్రి వర్యులు వచ్చేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు.  కార్యక్రమం పూర్తి అయ్యేవరకు విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం జరగకుండా చూడాలని విద్యుత్ శాఖదికారులకు ఆదేశించారు. అత్యవసర్ వైద్యం నిమితం పారా  మెడికల్ సిబ్బందిని, 108 వాహనాన్ని  ఏర్పాటు చేయాలనీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి ఆదేశించారు.  పబ్లిక్ అడ్రస్ సిస్టం ను తనిఖీ చేసుకొని, ప్రసంగాన్ని మంత్రివర్యులకు అందించాలని సమాచార శాఖాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, మున్సిపల్ కమీషనర్ వర్మ, పర్యాటక అధికారి లక్ష్మినరయన, విపతుల ప్రాజెక్ట్ అధీకారి పద్మావతి తదితర అధికారులు హాజరైనారు.