గిరిజనుల అభ్యున్నతికే ఆరోఎఫ్ఆర్..
Ens Balu
6
Srikakulam
2020-10-31 19:34:20
గిరిజనుల అభ్యున్నతికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు దోహదం చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు అన్నారు. పలాస నియోజకవర్గం మందస మండలం తహశీల్దారు కార్యాలయంలో జరిగిన గిరిజనులకు ఆర్.ఓ.ఎఫ్.ఆప్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మక అటవీ హక్కుల భూ పంపిణీ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సాధించిందని అన్నారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు అందని లబ్దిదారులు ఉంటే వారిని గుర్తించి వారికీ కూడా పట్టాలు అందజేస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు లేని వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టాలు పంపణీకి చర్యలు చేపట్టారని చెప్పారు. ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుందని, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి నీటి ఎద్దడి లేకుండా చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. పలాస నియోజకవర్గంలో సుమారు అన్ని గిరిజన ప్రాంతాలకు తారు రహదారులు వేయించామని, మందస మండలంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గిరిజన సామాజిక భవన నిర్మాణానికి మూప్పై లక్షలు ఖర్చు చేసి నిర్మాణం త్వరలో చేపడతామని మంత్రి తెలిపారు. సీపి పంచాయతీ దాలసిరి జలపాతం వద్దకు రహదారి నిర్మాణానికి రెండు కోట్లు రూపాయిలు విడుదల చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి, డి.సి.ఎం.ఎస్ అధ్యక్షులు పిరియా సాయిరాజ్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, మూడు మండలాల తహశీల్దార్లు, స్దానిక నాయకులు, తదితర అధికార అనధికారులు పాల్గొన్నారు.