అనుకోని సంఘటనలను ప్రతిఘటించాలి..


Ens Balu
2
Eluru
2020-10-31 19:53:44

ధైర్యంగా వుండంతోపాటు అనుకొని సంఘటనలకు మహిళలు గట్టిగా ప్రతిఘటించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు.  లింగపాలెం మండలం తోచిలకరాయుడుపాలెంలో అక్టొబర్‌ 14‌న హత్యకుగరైయిన విస్సంపలి అంజలి (8) కుటుంబ సభ్యులను శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ శ్రీ‌మతి వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వం హహిళా సాధికారిత దిశగా పరుగులు తీస్తున్న దశలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరం అన్నారు.  బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా వుంటుందని, నిందితుడ్ని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదన్నారు.  గ్రామంలో ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తి వ్యవహరశైలి అందరికి తెలిసినప్పుడు ముందే అటువంటి వ్యక్తిపట్ల అప్రమత్తతగా వుండాల్సిందన్నారు. అభంశుభం తెలియని చిన్నారుల పట్ల ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయని, మరొకరు ఇటువంటి సంఘటనలకు పాల్పడనటువంటి చర్యలు వుంటాయన్నారు. ప్రతి వ్యక్తి తన కుటుంబంలో వున్న మహిళలకు ఇచ్చే గౌరవాన్ని బయటి మహిళలకు ఇచ్చేలా వారి తల్లిదండ్రులు పాఠాలు నేర్పాలన్నారు.  ప్రస్తుతం కేసు ఇన్వేస్టిగేషన్‌ ‌జరుగుతుందని ఫొరెన్సిక్‌ ‌నివేదిక అందాల్సివుందన్నారు. హత్యఅనేది నిర్ధారించుకున్నాక 24 గంటలలో అరెస్టుచేయడం, ప్రస్తుతం ఫోక్సొచట్టాన్ని కూడా నమోదు చేయడం జరిగిందన్నారు.  మహిళలు ధైర్యంగా వుంటే ఎంతటి సంఘటనలైన ఎదుర్కొగలరన్నారు. తొలుత బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యంగా వుండాలని, ప్రభుత్వం అండగా వుంటుందని హామి ఇచ్చారు. మహిళల కేసుల జాప్యంలో మేము, ప్రభుత్వం సహించదన్నారు.  జిల్లా యంత్రాంగం స్త్రీ,శిశు సంక్షేమశాఖ ద్వారా పంపిన రు.25 వేల చెక్కును అమె బాధిత కుటుంబానికి అందచేశారు. ఈ పర్యటనలో కమిషన్‌ ‌సభ్యురాలు డా.రాజ్యలక్ష్మి, చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఆర్‌.ఎలీజా, స్త్రీ,శిశుసంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి పిడి కె.విజయ కుమారి, డిఎస్‌పి సునీల్‌, ‌మహిళా నాయకులు జానకిరెడ్డి, పిల్లంగోళ్ళ లక్ష్మి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గోన్నారు.