ఘనంగా పోలీసు అమరవీరుల వారోత్సవాలు..


Ens Balu
2
Tirupati
2020-10-31 20:22:33

ప్రజలకు నిత్యం రక్షణ కల్పించడంలోనే పోలీసులు నిమగ్నమవ్వాలని, అమరవీరుల త్యాగాలను మననం చేసుకుంటూ సేవలు అందించాలని తిరుపతి అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి పిలపునిచ్చారు. శనివారం పోలీసు అమరవీరుల స్మృతి వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు అమరవీరుల స్మృతి  ముగింపు దినం వేడుకలకు హాజరైనందుకు గర్వంగా భావిస్తున్నానన్నారు. పోలీస్ విధులలో ఎన్ని కష్ట నష్టములు ఎదురైననూ వాటిని ఎదుర్కొని మిక్కిలి సంతృప్తికరమైన సేవలు అందిస్తున్న పోలీసులను,అలాగే ఈ వారం రోజుల పాటు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాంగం పోలీస్ అమర వీరుల వారోత్సవాలను విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసినవారిని ఎస్పీ అభినందించారు.   ఈ వారం రోజులలో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, రన్ ఫర్ యూనిటీ, డిబేట్, వ్యాస రచన పోటీలు, చిత్రలేక పోటీలు విజేతలకు, “రన్ ఫర్ యూనిటీ” 2K రన్ నందు ప్రతిభ కనుబరిచిన పోలీస్ సిబ్బందికి నగదు భహుమతులను అందజేశారు. అలాగే ఇటీవల కాలంలో తిరుపతి అర్బన్ జిల్లా యందు విధి నిర్వహణలో అకాల మరణం పొందిన పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి రావలసిన మొత్తాన్ని చెక్కుల రూపంలో జిల్లా యస్.పి  వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమాలలో అడ్మిన్ అడిషనల్ యస్.పి సుప్రజ మేడం, డి.యస్.పి యస్.బి గంగయ్య, సైబర్ క్రైమ్  రవి కుమార్, క్రైమ్ మురళిదర్, వెస్ట్ నరసప్ప, ఈస్ట్ మురళీకృష్ణ, ట్రాఫిక్ మల్లికార్జున,  నాగసుబ్బన్న, తిరుమల రమణ కుమార్,  ఏ.ఆర్ నంద కిశోర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.