చిట్టివలస జూట్ కార్మికుల బకాయిలను చెల్లించాల్సిందే..
Ens Balu
3
Visakhapatnam
2020-07-24 15:58:03
చిట్టివలస జ్యూట్ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు యాజమాన్యాన్ని ఆదేశిం చారు.చిట్టివలస జ్యూట్ మిల్లు, యాజమాన్యం, కార్మికులతో మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. చిట్టివలస జ్యూట్ మిల్లు అగ్రిమెంటు చేసి సంవత్సరకాలం నిన్నటితో పూరైందు వలన మంత్రి సమావేశం నిర్వహించారు. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు యాజమాన్యం పూర్తిగా చెల్లించాలని, ప్రతికార్మికునికి శాశ్వత, ప్రత్యేక బదిలి, బదిలి, కొత్తగా బదిలి, కార్మీకులకు రూ.27,500/-లు చొప్పున మరియు అప్రంటిసు కార్మికులకు రూ.10,000/-లు చొప్పున ఇస్తానని యజమాన్యం ఒప్పుకున్న ప్రకారం తక్షణమే కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్ని వెంటనే చెల్లించాలని జ్యూట్ మిల్లు యజమాని కె.కె. బజోరి యాను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో యజమాన్యం ప్రతినిధిలు జోషి, రామ్ కుమార్, ఐక్య కార్యాచరణ కమిటి కార్మిక నాయకులు కె.వరహాలరాజు, చిల్ల వెంకటరమణ, జీరు, వెంకటరెడ్డి, వలనకాల ఆదినారాయణరెడ్డి, దల్లి అప్పలరెడ్డి, పడాలరమణ, కొండపు ఈశ్వరరావు, రామ్ ప్తెడియ్య, మద్దెల దేవుళ్లు, నరవ రామరావు, తదితరులు పాల్గొన్నారు.